సిరా న్యూస్,సికింద్రాబాద్;
కలకత్తాలో జూనియర్ వైద్యురాలి పై జరిగిన హత్యాచారాన్ని నిరసిస్తూ సికింద్రాబాద్ డెంటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్యులు నిరసన ర్యాలీ చేపట్టారు. పరేడ్ మైదానం నుండి క్లాక్ టవర్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టి బాధిత వైద్యురాలికి సత్వర న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. వెంటనే కేసులు సిబిఐ కి అప్పగించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్యుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం నూతన చట్టాలను అమల్లోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని గుర్తు చేశారు. వైద్యుల విషయం లో ప్రభుత్వాలు ఆలోచించి నూతన చట్టాలు తీసుకువచ్చి వైద్యుల భద్రతను మెరుగు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ డెంటిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు అభేద్ అలీ,సెక్రటరీ సుభాష్, పవన్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.