సిరా న్యూస్,అదోని;
రైతులు కష్టం నీటి పాలు , లక్షలు విలువ చేసే వేరుశనగ తడిసి ముద్దైంది.కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు రైతులు వేరుశనగ విక్రయానికి తీసుకొచ్చారు.ఒక్కసారిగా వర్షం రావడంతో మార్కెట్ యార్డులో విక్రయానికి రాశులు పోసిన వేరుశనగ దిగుబడులు వర్షపు నీటితో తడిసి ముద్దయ్యాయి. దీంతో లక్షలు విలువచేసే వేరుశనగ నీటిలో మునిగిపోవడంతో లక్షల్లో నష్టపోయామని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు.లక్షలు విలువ చేసే వేరుశనగా నీటి పాలైయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.వర్షాలు వచ్చినప్పుడు దిగుబడులు కాపాడుకోవడానికి కనీస వసతులు కల్పించలేని మార్కెట్ యార్డ్ అధికారులపై రైతులు మండిపడ్డారు తమకు జరిగిన నష్టాన్ని అధికారులు భరించాలని డిమాండ్ చేశారు.