సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
ఎలక్ట్రానిక్ బైక్ షోరూమ్‌ను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో సోమవారం నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఏవిదేఖో మల్టీ బ్రాండ్ ఎలక్ట్రానిక్ బైక్ షోరూమ్ ను సోమవారం ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఖానాపూర్ పట్టణంలో ప్రజల అందుబాటులో విద్యుత్ ఎలక్ట్రానిక్ బైక్ లను తక్కువ ధరకు తీసుకు రావడం పట్ల షోరూమ్ యజమాని చరణ్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నాయకులు షబ్బీర్ పాషా , ఎస్ఐ లింబద్రి , మహాజన్ జితేందర్, అయిందల జనర్ధన్ , తదితరులు పాల్గొన్నారు.