బాలినేని
సిరా న్యూస్,విజయవాడ;
ఎన్నికల ఫలితాలు వచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పాటైన రెండు నెలలు దాటినా రిజల్ట్స్ పై మాత్రం వైసీపీకి ఇంకా అనుమానాలు పోలేదు. ఈ క్రమంలోనే ఒంగోలు వైసిపి అభ్యర్థిగా పోటీ చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి మరోసారి ఈవిఎంల వెరిఫికేషన్ అండ్ చెకింగ్ చేయాలంటూ ఎన్నికల కమీషన్ దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో ఈసీ ఈరోజు ఎన్నికల మాక్ పోలీంగ్ కు ఆదేశాలు ఇచ్చింది. జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా కూడా ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నారు. ఈరోజు ఉదయం 10 గంటల నుండి నాలుగు రోజుల పాటు అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించేందుకు సిద్దమయ్యారు. దీంతో ఈ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. కాని ఉదయం బాలినేని ప్రతినిధిగా వచ్చిన వ్యక్తి మాక్ పోలింగ్ పై అభ్యంతరం వ్యక్తం చేసి బయటకు వెళ్ళిపోయారు