సిరాన్యూస్,ఆదిలాబాద్
ఈనెల 25న హిందీ భాష సేవా సమితి సమావేశం: హిందీ భాష సేవా సమితి జిల్లా అధ్యక్షులు సుకుమార్ పేట్కులే
హిందీ భాష సేవా సమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 14న జరిగే హిందీ దినోత్సవ వేడుకలు ఏర్పాట్లకై సమీక్ష సమావేశాన్ని ఈనెల 25 ఆదివారం ఉదయం 10 గంటలకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీ లో గల ఫూలే విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేయనున్నట్లు హిందీ భాష సేవా సమితి జిల్లా అధ్యక్షులు సుకుమార్ పేట్కులే ఒక ప్రకటనలో తెలిపారు. పదోన్నతి పొందిన హిందీ ఉపాధ్యాయులకు సన్మానించనున్నట్లు తెలిపారు. హిందీ భాష సేవాసమితి కార్యవర్గ సభ్యులు , హింది పండితులు సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు.