సిరాన్యూస్, కళ్యాణదుర్గం
కెనారా బ్యాంక్ ఎదుట మహిళల ఆందోళన
కళ్యాణదుర్గం పట్టణంలో అనంతపురం రోడ్లో ఉన్న కెనరా బ్యాంక్ ( సిండికేట్) ఎదుట మంగళవారం పొదుపు సంఘాల మహిళలు ఆందోళన చేపట్టారు. అనంతరం మహిళలు పెద్ద ఎత్తున రోడ్డు పై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ అదే గ్రామానికి చెందిన మల్లికార్జున యానిమేటర్ ప్రోద్బలంతో బ్యాంక్ అధికారులు కుమ్మక్కై మహిళలకు అన్యాయం చేశారన్నారు. దాదాలు 60 లక్షల రూపాయలకు పైగా కాజేశారని తెలిపారు. ఒక సంఘానికి కొత్తలోనూ ఇవ్వాలంటే పదిమంది సభ్యులు కావాలంటూ 30 సంఘాల సభ్యులు లేకుండా బ్యాంకు అధికారులు ఎలా ఇచ్చారో చెప్పాలని మహిళలు డిమాండ్ చేశారు