సిరాన్యూస్, కుందుర్పి
ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన అవసరం: రీడ్స్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు మేనేజర్ శ్రీనివాసరెడ్డి
ఎయిడ్స్ రహిత సమాజ స్థాపనకు అందరూ కృషి చేయాలని రీడ్స్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు మేనేజర్ శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ మండలి ఆదేశాల మేరకు జిల్లా హెచ్ఐవి ,ఎయిడ్స్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో రీడ్స్ స్వచ్ఛంద సంస్థ వారు మండల కేంద్రమైన కుందుర్పి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హెచ్.ఐ.వి, ఎయిడ్స్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్బంగా ప్రాజెక్టు మేనేజర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ యుక్త వయసు వారు సరైన అవగాహన లేకపోవడం వల్ల ఈ మహమ్మారి బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమములో జూనియర్ కళాశాలప్రిన్సిపాల్ కృష్ణమూర్తి ,యన్.యస్.యస్ అధ్యాపకులు ఉమామహేశ్వరరావు , అధ్యాపక బృందం, ఏ.ఎన్.ఎం అనసూయమ్మ, ఔట్రీచ్ వర్కర్స్ వరలక్ష్మీ, భాగ్యమ్మా, పీర్ ఎడ్యుకేటర్ నాగలక్ష్మి కవిత, దివ్య,శశికళ పాల్గొన్నారు.