సిరాన్యూస్, కుందుర్పి
23న కుందుర్పిలో గ్రామసభ : పంచాయతీ కార్యదర్శి పి. మహబూబ్ బాషా
మండల కేంద్రమైన కుందుర్పి గ్రామంలో స్థానిక పొదర్ ఆలయం వద్ద మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద చేపట్టేబోయే పనులు గుర్తించడానికి ఈనెల 23న గ్రామ సభ నిర్వహిస్తున్నట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి పి. మహబూబ్ బాషా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సభకు ప్రజలు తప్ప కుండా హాజరు కావాలని కోరారు. ప్రజలుకు ఈ పనులు పైన అవగాహన కల్పించడానికి గ్రామ పంచాయతీ కార్యదర్శి గోడ పత్రికలను అలయం ఎదుట అంటించారు.