అమలాపురం,సిరా న్యూస్;
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ దేశవ్యాప్త బంద్ లో భాగంగా కోనసీమలో బంద్ ప్రశాంతంగా సాగుతోంది. కోనసీమలోని మాల మహానాడు ఆధ్వర్యంలో కోనసీమ వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచే ఆర్టీసీ బస్సులు బందు సందర్భంగా నిలిపివేశారు.విద్యాసంస్థలు ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. కోనసీమలోని అమలాపురం ,రాజోలు, ముమ్మిడివరం, p .గన్నవరం, రావులపాలెం ,కొత్తపేట ప్రాంతాల్లో బంద్ ప్రభావం కనిపించింది. తెల్లవారుజాము నుంచే మాల మహానాడు కార్యకర్తలు ఆయా ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులను ఇతర రవాణా వాహనాలను అడ్డుకున్నారు. తక్షణం సుప్రీంకోర్టు