సిరాన్యూస్,సైదాపూర్
రుణమాఫీ అయినా రైతులు ధర్నాకు రావడం సిగ్గుచేటు: కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దొంత సుధాకర్
సైదాపూర్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రుణమాఫీపై గురువారం చేపట్టిన ధర్నాకు రుణమాఫీ అయిన రైతులు ధర్నాకు రావటం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొంత సుధాకర్ , యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రఘుయాదవ్ విమర్శించారు. గురువారం మండల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మి రైతులు మోసపోవద్దన్నారు. సాంకేతిక కారణాల దష్ట్యా కొంతమంది కి రుణమాఫీ జరగలేదని, కానివారు మండల వ్యవసాయ అధికారిని సంప్రదించవచ్చునని అన్నారు. రుణమాఫీ కానీ రైతులు కోసం అత్యవసర హెల్ప్ లైన్ సెంటర్ లు కూడా ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశంలో రాజు, వెంకటేశ్వరరావు, తిరుపతి నాయక్, నవీన్, తదితరులు ఉన్నారు.