వానపల్లి గ్రామంలో చంద్రబాబు సభ కోసం ముమ్మరంగా ఏర్పాట్లు

సిరా న్యూస్,కొత్తపేట;
వానపల్లి గ్రామంలో చంద్రబాబు సభ కోసం ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సభ స్థలాన్ని అధికారులతో కలిసి పర్యవేక్షిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించిన తర్వాత మొదటిసారి కోనసీమ జిల్లాకు వస్తున్ఆరు. రాష్ట్రవ్యాప్తంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తరుణంలో గ్రామసభ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వానపల్లి వేదికగా ప్రారంభించనున్నారు. జిల్లా ఉన్నతాధికారులు పర్యటనను దృష్టిలో పెట్టుకొని జిల్లా అధికార యంత్రాంగం, కూటమి నేతలు భారీ ఏర్పాట్లను చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *