సిరాన్యూస్, ఇచ్చోడ
బోరిగామలో ఘనంగా జాతీయ అంతరిక్ష దినోత్సవం వేడుకలు
దిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం బోరిగామ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారుచేసిన చంద్రయాన్ 3 నమూనాను ప్రదర్శించారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు రమాకాంత్ భారతదేశం శాస్త్ర సాంకేతిక, వైజ్ఞానిక విద్య, వైద్య పరంగా అవధులు దాటి అంతరిక్షానికి సైతం వెళ్లడానికి సిద్ధమైన నేటి భారతం మనందరికీ గర్వకారణమని ,అదేవిధంగా అజ్ఞానం వంటి విజ్ఞానం వైపు చీకటి నుండి వెలుగు వైపుకు నడిపించేది సైన్స్ అని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వినోద్ కుమార్, కృష్ణ మోహన్, విజయ్ కుమార్, రవిత విద్యార్థులు పాల్గొన్నారు.