: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ..
సిరా న్యూస్,రాజన్న సిరిసిల్ల;
50 పైగా ప్రైవేట్ కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహణ జిల్లా లోని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి.. పదవ తరగతి నుంచి పీజీ వరకు చేసిన నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల కల్పన ఆగస్టు 25న వేములవాడలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఫార్మా, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ మార్కెటింగ్ ఆటోమొబైల్స్, మేనేజ్మెంట్, సెక్యూరిటీ, ఎం.ఎన్.సి లకు చెందిన 50 పైగా కంపెనీలతో వేములవాడ లోని మహాలింగేశ్వర గార్డెన్స్ లో ఆదివారం ఆగస్టు 25న మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని అన్నారు. మెగా జాబ్ మేళాలో అపోలో ఫార్మసీ, శుభ గృహ అనుభవ్ సాఫ్ట్, వరుణ్ మోటార్స్, ఐటిసి ఫుడ్స్, రానే బ్రేక్ లైనర్స్ మ్యాను ఫ్యాక్చరింగ్ కంపెనీ మొదలగు ప్రముఖం కంపెనీలు, విప్రో ఇన్ఫోసిస్ వంటి సాఫ్ట్వేర్ కంపెనీల అనుబంధ సంస్థలు 5 వేలకు పైగా ఉద్యోగాలను ఆఫర్ చేస్తున్నాయని తెలిపారు.
జిల్లాలోని పదవ తరగతి నుంచి పిజి వరకు ఉత్తీర్ణత సాధించి ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు మెగా జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.