సిరాన్యూస్, బేల
రుణ మాఫీ కానీ రైతులు దరఖాస్తు చేసుకోవాలి : ఏఈఓ వినయ్‌కుమార్
వివిధ కారణాలు వల్ల రుణ మాఫీ కానీ రైతులు దరఖాస్తు చేసుకావాలని ఏఈఓ వినయ్‌కుమార్ అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడీ గ్రామంలో రైతు వేదిక ప్రాంగణంలో రైతులతో రుణమాఫీ గురించి చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రుణమాఫీ కానీ ఎడల రైతులు తమ పట్ట పాసుబుక్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ బ్యాంక్ స్టేట్మెంట్ తదితర అప్లికేషన్లు సమర్పించారు అని అన్నారు. నిత్యం రైతులకు అందుబాటులో ఉంటానన్నారు. ఏదైన సమస్య ఉంటే 91 90142 08654 నంబర్ కు కాల్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు మహాజన్ పాండురంగ్, గోపతి నాగేష్,నవగరే అమోల్,మిలింద్ నాక్పూరే, తది తరులు పాల్గొన్నారు.