సిరా న్యూస్,నిజామాబాద్;
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ అధ్వర్యంలో నిర్వహేంచే మహాధర్నాకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు…
ప్రధానంగా రైతులు వచ్చే ప్రాంతాలైన పోచంపాడ్ ఎక్స్ రోడ్డు ,కమ్మర్పల్లి, చెపూర్, గోవింద్ పెట్ అర్గుల్ ల్లో చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి బందోబస్తు ఏర్పాటు చేశారు ….రైతులందరికీ 2లక్షల లోపు ఏ షరతులు లేకుండా రుణ మాఫీ చేయలన్న ప్రధాన డిమాండ్ తో టీజీఓ రైతులు ధర్నా పిలుపు ఇచ్చారు. రైతులు ధర్నాలు చేసేందుకు పర్మిషన్ తీసుకుంటే 163 సెక్షన్ ఏర్పాటు చేసి 45 మంది కంటే ఎక్కువ ఉండకూడదని చెప్పడం సిగ్గుచేటని రైతు నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు… అయినప్పటికీ రైతులు భారీగా పాల్గొంటారని వారు అంటున్నారు…..