సిరా న్యూస్,హైదరాబాద్;
బెట్టింగ్ వీడియోలు చూసి లక్షల్లో అప్పు చేసి మరి ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లో డబ్బులు పోగొట్టుకుంటున్న యువత, అప్పు తీర్చలేక, రోజుకో ఇద్దరు, ముగ్గురు ఆత్మహత్య చేసుకుంటున్నారు. సోషల్ మీడియా, ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్ ,ఇతర మాధ్యమాలలో అడ్డాగా ఆన్లైన్ బెట్టింగ్ మాఫియా మారింది. ఈ కింది లింక్ ని డౌన్లోడ్ చేసుకోండి. రోజుకు 20వేల నుండి 50 వేలు సంపాదించుకోండి అంటూ యువతను తప్పు దోవ పట్టిస్తున్నారు. ఆన్లైన్ గేమ్ లకు బానిసై ముఖ్యంగా యువత తమ తల్లిదండ్రులకు తెలియకుండా వారి అకౌంట్లో ఉన్న డబ్బులు మరియు అప్పులు చేసి ఆన్లైన్ గేమ్స్ లో లక్షలకు మరియు కోట్ల రూపాయలు పోగొట్టులోని ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటున్నారు. చేసిన అప్పులు తీర్చలేక యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
బెట్టింగ్ యాప్ లింకులు ఇంస్టాగ్రామ్ మరియు ఫేస్బుక్ ద్వారా ప్రచారం చేసి వారు మాత్రం లక్షలకు లక్షలు రిఫరెన్స్ ద్వారా డబ్బులు సంపాదించుకుంటున్నారు. వీరి మాటలు నమ్మి యువత డబ్బుకు ఆశపడి ప్రాణాల పైకి తెచ్చుకుంటున్నారు.