సిరాన్యూస్, ఆదిలాబాద్
బెదిరింపులకు భయపడం.. రైతుల పక్షాన ఉద్యమిస్తాం:రైతు సమన్వయ మాజీ అధ్యక్షులు లింగారెడ్డి
బి ఆర్ఎస్ కార్యకర్తలు ఎలాంటి బెదిరింపులకు లొంగరాన్ని, రైతులకు అందాల్సిన రుణమాఫీ తో పాటు రైతు భరోసా అందించేంత వరకు మరిన్ని ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని రైతు సమన్వయ మాజీ అధ్యక్షులు లింగారెడ్డి అన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు జోగు రామన్న పై విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు. జోగు రామన్న చేసిన అభివృద్ధిపై పొగుడుతూ మాట్లాడిన కొంతమంది నాయకులు ఎవరి లాబాదే కోసం కాంగ్రెస్ పార్టీ చేరారో వారిని ఏమంటారు అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు కేవలం ఇప్పటివరకు 30 శాతం మాత్రమే రుణమాఫీ చేసిందని, వానాకాలం పూర్తి అవుతున్న ఇప్పటివరకు రైతు భరోసా రైతులకు అందించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరించిందని అన్నారు. రైతులకు అండగా నిలవాల్సింది పోయి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను చెంచాలు అనే మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని సూచించారు. పదవులు అనుభవించి అధికారం పోగానే.. మళ్లీ అధికార దాహంతో నేల లోపే కాంగ్రెస్ పార్టీలోకి చేరిన భోజా రెడ్డి లాంటి నాయకులను ఏమంటారని ప్రశ్నించారు.ఇలాంటి వ్యక్తులు బి ఆర్ఎస్ పార్టీ కార్యకర్తల గురించి మాట్లాడటం హాస్యస్పదమని ఎద్దేవా చేశారు. జైనథ్ మండలంలోని పిఎసిఎస్ బ్యాంకులో 1700 మంది రైతులకు రుణమాఫీ కాలేదని, వీటిపై కాంగ్రెస్ నాయకులు దృష్టి సారిస్తే బాగుంటుందని తెలియజేశారు. సమావేశంలో మాజీ మార్కెట్ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, బి ఆర్ఎస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ నారాయణ, మాజీ మార్కెట్ చైర్మన్ కుమ్రా రాజు, ఎక్స్ ఎంపీపీలు మార్శెట్టి గోవర్ధన్, గండ్రత్ రమేష్, బట్టు సతీష్, దయానంద్ తదితరులు పాల్గొన్నారు.