సిరాన్యూస్, ఆదిలాబాద్
అన్న భావు సాటే సేవలు స్ఫూర్తిదాయకం : కాంగ్రెస్ నాయకులు లోకా ప్రవీణ్ రెడ్డి
* రణదీవెనగర్ కాలనీలో అన్న భావు సాటే 104 వ జయంతి వేడుకలు
అన్న భావు సాటే సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్ పార్టీ నాయకులు లోకా ప్రవీణ్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ పట్టణంలోని రణదీవెనగర్ కాలనీలో భారతీయ సాహిత్య సామ్రాట్ డాక్టర్ అన్న బావూ సాటే 104 వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు లోకా ప్రవీణ్ రెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా అన్న బావూ సాటే చిత్రపటం తో పాటు అంబేద్కర్ మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేశారు. అంతకుముందు కార్యక్రమానికి హాజరైన లోక ప్రవీణ్ రెడ్డికి అన్న బావూ సాటే జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లోకా ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతగానో కృషిచేసిన మహానీయుడు భారతీయ సాహిత్య సామ్రాట్ అన్న బావూ సాటే అన్నారు. తాడిత పీడిత దళితుల అభ్యున్నతికి పాటుపడిన సాహిత్య సామ్రాట్ స్వాతంత్ర సంగ్రామం లోనూ ఎంతో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఆయన జయంతి వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో శ్యామ్ రావు, కామ్లే మధుకర్, రాజ్ కుమార్, ఇంతియాజ్ రాహుల్, రమకాంత్ వాగ్ మారే తదితరులు పాల్గొన్నారు.