సిరాన్యూస్, ఆదిలాబాద్
శ్రీ సరస్వతీ శిశు మందిర్‌లో కృష్ణ జన్మాష్టమి వేడుకలు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో సోమవారం శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా స్కూల్ యజమాన్యం మాట్లాడుతూ శ్రీకృష్ణ జన్మాష్టమి యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. సంస్కృతి సంప్రదాయాలకు పట్టు కొమ్మ అయిన శ్రీ సరస్వతీ శిశు మందిర్ లో కృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించామన్నారు.
విద్యాబుద్దులతో పాటు సనాతన సాంప్రదాయ ఆచార వ్యవహారాలు భవిష్యత్ తరాలకు అందించాలని ప్రతీ పండుగ కూడా పాఠ శాలలో జరుపుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సరస్వతీ విద్యాపీఠం సేవా ప్రముఖ్ గౌరి గంగాధర్,ప్రబందకారిని కమిటీ మెంబర్ పాఠశాల మెస్రం రాజేష్, ప్రధానోపాధ్యాయులు, సంజీవ్ విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.