సిరాన్యూస్, ఓదెల
అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే విజయరమణా రావు
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కనగర్తి గ్రామంలోని (కేశవ నగర్) ప్రాంతంలో రూ. 5లక్షల రూపాయల నిధులతో చేపడుతున్న అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణానికి స్థానిక నాయకులతో కలిసి పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు శంకుస్థాపన చేశారు.ముందుగా గ్రామస్తులు ఎమ్మెల్యే శాలువాలతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ రానున్న రోజుల్లో కనగర్తి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాననిఅన్నారు. ఏక కాలంలో రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వనిది అని ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ 2 లక్షల రుణమాఫీ ప్రకటించారని, ఎన్నికల హామీకి కట్టుబడి ఉండి రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. అర్హులైన ప్రతి రైతుకు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసి తీరుతుందని ప్రతిపక్షాలు చేసే విమర్శలను రైతులు నమ్మకూడదని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్నిచోట్ల సాంకేతిక లోపాల వల్ల, మరికొన్ని చోట్ల బ్యాంకుల తప్పిదం వల్ల రైతులకు రుణమాఫీ అందలేదని, వాటన్నిటిని సవరించి పూర్తిస్థాయిలో రుణమాఫీ అందజేస్తామని రైతులు నిరాశ చెందవద్దని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పాతాళ లోకంలో పడదేసిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలు కొన్నిచోట్ల రైతుల ముసుగులో రుణమాఫీ ఆందోళనలు పాల్పడుతున్నారని, వారికి రైతులే తగిన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. రుణమాఫీ ఫై తోడు దొంగలైన కేటీఆర్, హరీష్ రావులు అబద్దాలతో పోటీపడి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.