-మంథనిలో ఘనంగా విజయోత్సవ ర్యాలీ
-అధిక సంఖ్యలో పాల్గొన్న ఆర్యవైశ్య సంఘం నాయకులు, సభ్యులు
సిరా న్యూస్,మంథని;
పెద్దపెల్లి జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడిగా మంథని పట్టణానికి చెందిన నలుమాచు ప్రభాకర్ ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం మంథని పట్టణంలో నలుమాచు ప్రభాకర్ ఆర్యవైశ్య సంఘం నాయకులతో, తన అనుచర గణంతో కలసి డీజే చప్పుల్ల మధ్య పురవీధుల గుండా భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి ఆర్యవైశ్య సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ ను పలువురు ఘనంగా సన్మానించారు. తన నియామకానికి సహకరించిన మంత్రి శ్రీధర్ బాబుకు ప్రభాకర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని, ఆర్యవైశ్య సంఘ అభివృద్ధి కోసం కృషి చేస్తానని నలుమాచు ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు రావికంటి సతీష్, ఓల్లాల సత్యనారాయణ, కొత్త శ్రీనివాస్ గుప్తా, ఇల్లెందుల కిషోర్ కుమార్, ఓల్లాల వెంకటేశ్వర్లు, కొమురవెల్లి విజయభాస్కర్, బజ్జురి ప్రవీణ్, ఓల్లాల నాగరాజు,ఆనంతుల సాయి, చైత్ర నరేష్, రాచర్ల నాగభూషణం, దొంతుల ఓంప్రకాశ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓడ్నాల శ్రీనివాస్, ఆకుల కిరణ్, ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.