సిరాన్యూస్, ఇచ్చోడ
పశువులు, కుక్కల బెడద నుంచి కాపాడాలి : ఇచ్చోడ ఎమ్మార్పీఎస్ నాయకులు
* ఎంపీడీఓకు వినతి పత్రం అందజేత
పశువులు, కుక్కలు, కోతుల బెడద నుంచి ప్రజలను కాపాడాలని ఇచ్చోడ ఎమ్మార్పీఎస్ నాయకులు అన్నారు. మంగళవారం అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారి కొండ లక్ష్మణ్ కు ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మండల కేంద్రంలోని ప్రధాన వీధులలో పశువులు, కోతులు, కుక్కలు ఎక్కువైయ్యాయన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని తెలిపారు. విద్యార్థులు పాఠశాలకు వెళ్తున్న సందర్భంగా వారి వెంట పడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయన్నారు. కోతులు, పశువులు, కుక్కల బెడదను నివారించాలని కోరారు.కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి నాయకులు దుబ్బాక సుభాష్ మాదిగ, సిరిసిల్ల భూమయ్య మాదిగ, చిట్టి రవి మాదిగ, మచ్చ గంగయ్య మాదిగ, కల్లేపల్లి రాజు మాదిగ, ఆరేపల్లి రవి మాదిగ, ముదుగు శ్రీను మాదిగ, నీదురు నరేష్ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.