రాష్ట్ర బీసి సంక్షేమం శాఖా మంత్రి సవిత
సిరా న్యూస్,అనంతపురం;
జూనియర్ కళాశాల విద్యార్థి తేజ ఆత్మహత్యపై లోతుగా విచారణ జరపాలని రాష్ట్ర బీసి సంక్షేమం శాఖా మంత్రి సవిత పోలీసులను ఆదేశించారు.
కళ్యాణదుర్గం మండలం పాలవాయి గ్రామానికి చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి తేజ అనంతపురం అర్బన్ కళాశాల బాయ్స్ హాస్టల్ లో ఆత్మహత్య చేసుకుని మృతిచెందాడు.
అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని అత్యవసర విభాగంలో పోస్టుమార్టం కోసం వచ్చిన విద్యార్థి మృతదేహాన్ని మంత్రి సవిత, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్, జిల్లా ఎస్పీ పి. జగదీష్, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, తదితరులు పరిశీలించారు.
మంత్రి మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థి తేజ మృతికి గల కారణాలు తెలుసుకొని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తరువా కుటుంబ సభ్యులను పరామర్శించారు. హాస్టల్ విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది తో కలసి ఆత్మహత్యకు గల వివరాలు అడిగి తెలుసుకున్నారు. తక్షణ సాయం కింద ప్రభుత్వం తరఫున మట్టి ఖర్చులకోసం ఒక లక్ష రూపాయలను విద్యార్థి కుటుంబ సభ్యులకు అందజేశామని తెలిపారు. పోస్టుమార్టం తర్వాత నివేదిక అందజేస్తామన్నారు. విద్యార్థి కుటుంబానికి అండగా ఉంటామన్నారు.