సంగారెడ్డిలో గంజాయి పట్టివేత

83.4 గంజాయి స్వాధీనం
చిత్తూరుకు చెందిన వ్యక్తితో పాటు వాహనం సీజ్
పట్టుకున్న గంజాయి విలువ.రూ 33. 50 లక్షలు
 సిరా న్యూస్,సంగారెడ్డి;
శతకోటి ఉపాయాలకు అనంత కోటి మార్గాలు అన్నట్లుగా.. గంజాయి అక్రమ రవాణా దారులు పోలీసులకు చిక్కకుండా వివిధ రకాల జిమ్మిక్కులు చేస్తూ ఉంటారు. కానీ గంజాయి అక్రమార్కులు వేసే ఎత్తులను చిత్తు చేయడానికి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు కొత్త కొత్త మార్గాలు కనిపెడుతూ వస్తూ ఉంటారు. ఇలాంటి ఘటననే సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కొంకోల్ చెక్ పోస్ట్ వద్ద చోటు చేసుకుంది. ఏఓబి నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న గంజాయిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు భగ్నం చేశారు. గాంధీ నాయక్, ఎస్సై అనిల్ కుమార్ సిబ్బందితో కలిసి పక్కగా వచ్చిన సమాచారం మేరకు కొంకూల్ చెక్ పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేపట్టారు. అనుమానం వచ్చిన మహారాష్ట్ర కు చెందినటువంటి టాటా సఫారీ వాహనాన్ని తనిఖీ చేశారు. వాహనంలో ఎలాంటి గంజాయి కనిపించలేదు.. కానీ అనుమానం వచ్చి వాహనం వెనుక భాగంలో ప్రాంతాన్ని పరిశీలించడంతో అందులో ప్రత్యేకంగా తయారు చేసినటువంటి అరల్లో గంజాయి పాకెట్లు కనిపించాయి. వాటిని ఒక్కొక్కటిగా బయటకు తీసి తూకం వేయగా గంజాయి మొత్తంగా 83.4 కేజీలుగా ఉంది. గంజాయి తో పాటు రూ. 2000 నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం ఈటవాకిలి గ్రామానికి చెందిన ఆఫీజ్ ను అదుపులోకి తీసుకొని విచారించారు. ఏఓపి నుంచి ఒక వ్యక్తి గంజాయి పాకెట్లను నింపుకొని తీసుకొని ఇచ్చాడని ఈ వాహనాన్ని మహారాష్ట్రకు తరలించడానికి తీసుకు వెళుతున్నట్లు విచారణలో డ్రైవర్ అంగీకరించాడు. * పట్టుకున్న గంజాయి విలువ ప్లస్ వాహనంతో కలిపి మొత్తం రూ.33. 50 లక్షల గా ఉంటుందని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ జి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గంజాయి ని పట్టుకున్న గాంధీ నాయక్, వీనారెడ్డి ఎస్సై అనిల్, సిబ్బంది హలీం అనిల్ కుమార్ రామారావు ప్రహ్లాదు లను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ వి బి కమలాసన్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ జై హరీష్ అసిస్టెంట్ కమిషనర్ జి శ్రీనివాసరెడ్డి అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *