సిరాన్యూస్, ఉట్నూర్
రాయిసెంటర్ భవన నిర్మాణానికి భూమి చేసిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని నర్సాపూర్(బి) గ్రామపంచాయతీ పరిధిలోని పెందుర్ గూడా గ్రామంలో రూ.15 లక్షల నిధులతో రాయిసెంటర్ భవన నిర్మాణ పనులకు ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మంగళవారం భూమి పూజ చేసి ప్రారంభించారు. ముందుగా హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు.అనంతరం గ్రామస్తులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ఎమ్మెల్యే మాట్లాడారు. 9 తెగల ఆదివాసులకు రాయి సెంటర్ అనేది న్యాయస్థానమన్నారు. సమస్త సమస్యలకు రాయి సెంటర్ సార్మెడీలు ఆధ్వర్యంలో అందరికీ సమాన న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం సబ్బండ వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించారు. అనంతరం వినతి పత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో రాయిసెంటర్ సార్మేడీలు, పటేల్లు, మాజీ సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.