సిరాన్యూస్, ఇంద్రవెల్లి
ఘనంగా తీజ్ ఉత్సవాలు… ఆడిపాడిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని హార్కాపూర్ తండా, సకారం తండా,ఈశ్వర్ గ్రామాలలో బంజారా, మథురా సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన తిజ్ ఉత్సవాలలో ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యేకు గ్రామస్తులు సంప్రదాయాల నృత్యాల మధ్య ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా జగదాంబ దేవి,సేవాలాల్ మహారాజ్, రామారావు మహారాజ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భోగ్ బండార్ కార్యక్రమం నిర్వహించారు.అనంతరం బంజారా పెద్దలతో,యువతులతో కలసి సంప్రదాయ నృత్యాలు చేసి ఆడి పాడారు. ఈ సందర్బంగా గ్రామస్తులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. బంజారా,మథురాల సంస్కృతి సంప్రదాయాలు గొప్పవని పేర్కొన్నారు.నవధాన్యాలను 9రోజుల పాటు పెళ్లి కానీ యువతులు అత్యంత భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించి తరతరాలుగా వస్తున్న అచారమని పేర్కొన్నారు .రాష్ట్ర ప్రభుత్వం సబ్బండ వర్గాల అభివృద్ధికి కృషి చేస్తుందని, గ్రామాలలో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కారం చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో బంజారా,మథురా సమాజం ప్రజలు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,యువతి, యువకులు, తదితరులు పాల్గొన్నారు.