సిరాన్యూస్, ఓదెల
జాతీయ నేత్రదాన పక్షోత్సవాల కరపత్రాల ఆవిష్కరించిన డీఎంహెచ్ఓ డాక్టర్ ప్రమోద్ కుమార్
25 నుండి సెప్టెంబర్ 8 వరకు జరుగబోయే జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి డాక్టర్ మేరుగు భీష్మాచారి ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ ప్రమోద్ కుమార్ కార్యాలయంలో కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరణానంతరం ఉపయోగపడే నేత్ర, అవయవ, శరీరం మట్టిలో వృధా పోనీయకుండా దానం చేసి మానవ మనుగడకు తోడ్పడాలని కోరారు. నేత్రదానం అంటే మొత్తం కనుగుడ్డు తీయడం కాదని ,కన్ను పైన ఉన్న పల్చని “కార్నియా ” అనే పొర మాత్రమేనని, మరణించిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించకుండా ఇంటి వద్దనే తీసుకోవడం జరుగుతుందని, ఈ కార్నియా మార్పిడి కోసం 15 లక్షలకు పైగా అంధులు వేచి ఉన్నారని, అందులో 60 శాతం మంది 12 సంవత్సరాల పిల్లలు ఉన్నారని , పెద్ద మనస్సుతో ,మానవతా దృక్పథంతో ఆలోచించి నేత్రదానం చేసి మానవ జన్మను చరితార్థం చేసుకోవాలని కోరారు .సదాశయ ఫౌండేషన్ గత 16 సంవత్సరాలుగా అవయవ శరీర దానాలపై విశేష కృషి చేస్తుండడం అందులో పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో డాక్టర్ మేరుగు భీష్మాచారి ఆధ్వర్యంలో 180 పైన నేత్ర, అవయవ దానం చేయడంగారికి అభినందనీయమని అన్నారు . కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్, ఇప్పనపల్లి వెంకటేశ్వర్లు, కొండ్ర. వేణు, నాగవెల్లి, నిఖిల్, జిడి, నవీన్ బైరి వినోద్ మెడికల్ తదితరులు పాల్గొన్నారు.