నేడు గ్రేట్ పాప్ సింగర్ మైకల్ జాక్సన్ జయంతి

సిరా న్యూస్;

మైకల్ జోసెఫ్ జాక్సన్ అమెరికాకు చెందిన ఒక ప్రముఖ సంగీత కళాకారుడు.
ఇతను ఆగస్టు 29 , 1958న జన్మించారు.
ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయిన ఆల్బం “త్రిల్లర్” జాక్సన్ పాడినది. పది సంవత్సరాల వయసులో తన అన్నతమ్ముళ్ళతో కలిసి పాడటం ఆరంభించిన జాక్సన్, నలభై ఏళ్ళకు పైగా సంగీత ప్రపంచంలో ఒక భాగంగా ఉన్నాడు. 1970 ప్రాంతంలో జాక్సన్ పాప్ సంగీతాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అమెరికాలోని శ్వేతజాతీయుల మద్దతు పొందిన మొదటి నల్ల జాతి సంగీత కళాకారుడు జాక్సన్.

జాక్సన్ మొత్తం 13 గ్రామీ అవార్డులు గెలుచుకున్నాడు. 8 ఒకే రాత్రి 1984 లో గెలుచుకున్నాడు. జాక్సన్ పాడిన పాటలలో 13 పాటలు అమెరికాలో నంబర్ 1 గా నిలిచాయి. ప్రపంచ మొత్తంలో జాక్సన్ సీడీలు 750 మిలియన్ కాపీలు అమ్ముడుపోయినట్లు ఓ అంచనా. జాక్సన్ యుఎస్300మిలియన్ల దానధర్మాలు చేసాడు.
కాని జాక్సన్ జీవితం వివాదాలతో కూడినది. 1990 నుండి జాక్సన్ ప్రజా సమ్మతి క్రమేణా కోల్పోతూ వచ్చాడు. 1988 నుండి 2005 వరకు జాక్సన్ తన నెవెర్‌లాండ్ రాంచ్లో ఉన్నాడు. అక్కడ ఒక జూ, అమ్యూజ్‌మెంట్ పార్క్ కట్టించాడు. కేన్సర్ వంటి వ్యాధులు వచ్చిన పిల్లలను అక్కడికి అనుమతించేవాడు. 11 ఫిబ్రవరి 2008 నాడు జాక్సన్ త్రిల్లర్ 25 అనే కొత్త ఆల్బం విడుదల చేసాడు. పాప్ రాజు జూన్ 25, 2009 న కార్డియాక్ అరెస్ట్ తరువాత ఊహించని విధంగా కన్నుమూశారు. అతని ఆకస్మిక మరియు విషాద మరణం మిలియన్ల మంది అతని మరణానికి సంతాపం ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *