సిరాన్యూస్, ఆదిలాబాద్
జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి పెంటపర్తి ఊశన్నకు ఘన సన్మానం
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జన విజ్ఞాన వేదిక ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పెంటపర్తి ఊశన్నను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈసందర్బంగా బుధవారం పెంటపర్తి ఊశన్నను పీఆర్‌టీయూ తెలంగాణ, ఎస్‌జీటీ యూనియన్, ఫిట్ ఇండియా ఫౌండేషన్, రెగ్యులర్ వాకింగ్ టీం తదితర సంఘాల నాయకులు శాలువా కప్పి, మహనీయుల పుస్తకాలు అందజేసి అభినందనలు తెలియజేశారు. అనంతరం వివిధ సంఘాల నాయకులు మాట్లాడారు. సైన్స్ సర్వాంతర్యామి, సైన్స్ లేకుండా ప్రపంచాన్ని ఊహించడం కష్టం, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మనం ఉహించనంత అభివృద్ధి సాధిస్తుందన్నారు. దీనికి ధీటుగా మూఢ విశ్వాసాలు వికృత రూపంలో శాస్త్ర, సాంకేతిక రంగాలకు గుదిబండగా మారుతుందని తెలిపారు . ఇది దేశ పురోభివృద్ధి అవరోధాంగా మారి అడ్డు తగులుతుందని, ఏది వాస్తవమో, మరేది అవాస్తవమో విజ్ఞతతో ఆలోచించాలన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఆదివాసులు జిల్లా మూఢ నమ్మకాలు మరింతగా ఎక్కవ ఉంటాయని, జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జనాన్ని చైతన్య పరచాలని కోరారు. కార్యక్రమంలో పీఆర్‌టీయూ తెలంగాణ జిల్లా ప్రధాన కార్యదర్శి నర్ర నవీన్ యాదవ్, ఫిట్ ఇండియా ఫౌండేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కూర పోచ్చన్న, యస్ జీ టి జిల్లా అధ్యక్షులు గడుగు నరేందర్, పీఆర్‌టీయూ తెలంగాణ నాయకులు ముజీఫ్, సంతోష్ కూమార్, రెగ్యులర్ వాకింగ్ టీం సభ్యులు మోరే వేంకటి, ఎల్మల నగేష్, రాచర్ల నారాయణ, అట్లా ఆశోక్ , కృష్ణ కూమార్, మహేందర్ రెడ్డి, మేకల మురళి, ఇస్తారి, మల్లేష్, సాయి బాబ, మెడపట్ల నర్సింగ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.