సిరాన్యూస్,ఆదిలాబాద్
బంజారా సంస్కృతి సంప్రదాయాలు ఎంతో గొప్పవి: ఎమ్మెల్యే పాయల్ శంకర్
* న్యూ హౌసింగ్ బోర్డులో తీజ్ ఉత్సవాలు
బంజారా సంస్కృతి సంప్రదాయాలు ఎంతో గొప్పవని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. బుధవారం ఆదిలాబాద్ లోని న్యూ హౌసింగ్ బోర్డులో తీజ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ తో ఎమ్మెల్యే పాయల్ శంకర్ కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ బంజారాల సమస్యల పరిష్కారానికి తను వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. అదేవిధంగా పట్టణంలో బంజారా భవన్ కోసం ప్రభుత్వాన్ని విన్నవిస్తా అని పేర్కొన్నారు. అదేవిధంగా పట్టణంలో సేవాలాల్ చౌక్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. హిందూ సంస్కృతి సంప్రదాయాలను ప్రతి ఒక్కరు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. పంచభూతాలను పూజించడం ద్వారానే భారత దేశంలో ఎలాంటి దుషపరిమాణాలు జరగడం లేదన్నారు. కార్యక్రమంలో నాయకులు పవన్, రఘుపతి, ముకుందరావు, వేద వ్యాస్, రిమ్స్ డైరెక్టర్, తదితరులు పాల్గొన్నారు.
