సిరాన్యూస్, ఖానాపూర్‌టౌన్
సదర్‌మార్ట్ లెప్ట్ కెనాల్ లో పడి మునుగురి వెంకటేష్ మృతి : ఎస్సై జి. లింబాద్రి
సదర్‌మార్ట్ లెప్ట్ కెనాల్ లో పడి మునుగురి వెంకటేష్ అనే వ్యక్తి మృతి చెందారు. ఖానాపూర్ ఎస్సై జి. లింబాద్రి తెలిపిన వివరాల ప్రకారం..నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని శివాజీ నగర్ కాలనీకి మునుగురి వెంకటేష్ (60) బుధవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో శివాజీ నగర్ అంబేద్కర్ నగర్ మధ్యన గల సదర్ మార్ట్ లెఫ్ట్ కెనాల్ బ్రిడ్జి పైన కూర్చుని ఉన్నారు. అదే సమయంలో ప్రమాదవశాత్తు జారీ కెనాల్ లో పడిపోయాడు. అది గమనించిన శివాజీ నగర్ వాసులు అతన్ని కెనాల్ నుండి బయటకు తీసి చికిత్స నిమిత్తం ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. డాక్టర్లు పరిశీలించి అప్పటికే మునుగురి వెంకటేష్ మృతి చెందినట్లు తెలిపారు.మృతుని అన్న కొడుకు మునుగురి భూమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.