సిరా న్యూస్,కాకినాడ;
కాకినాడ జిల్లా అన్నవరం నూతన నమూనా ఆలయం సమీపంలో కల్వర్టు వద్ద గురువారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో వెస్ట్ బెంగాల్ కు చెందిన లారీ క్రేన్ వాహనం ను ఢీకొట్టడం.క్రేన్ వాహనం లారీని ఢీకొట్టడం తో భారీ ఆస్తి నష్టo జరిగింది. లారీ కత్తి పూడి నుండి విశాఖపట్నం వెళుతూ అదే వైపు అన్నవరం నకు చెందిన కలుపుకురి సుభాష్ చెందిన క్రెన్ వాహనం ను బలంగా ఢీకొట్టడంతో ఆ తాకిడికి డివైడర్ దాటి విశాఖపట్నం నుండి కత్తిపూడి వైపు వెళ్తున్న హైవే రహదారి పైకి అకస్మాత్తుగా చొచ్చుకుపోయింది. దాంతో పప్పులు లోడుతో కలకత్తా నుండి నరసరావుపేట వెళుతున్న లారీని ఢీకొట్టింది. ఈ సంఘటన తీరు భారీ ప్రమాదoగా కనపడుతుంది. విజయవాడకు చెందిన కోన దుర్గారావు కు తలకు గాయాలవ్వడంతో హుటాహుటిన హైవే అoబులెన్సు వాహనం వచ్చి సిబ్బంది ప్రధమ చికిత్సచేశారు. ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా హైవే పెట్రోలింగ్ సిబ్బంది పర్యవేంచారు.