సిరా న్యూస్,ధర్మపురి;
గత కొన్ని రోజులుగా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో రోజురోజుకు జ్వరాల బారిన పడి హాస్పిటల్స్ వైపు పరుగులు పెడుతున్నారు. మరోవైపు ధర్మపురి పట్టణంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులతో నిండిపోయింది. ప్రభుత్వ హాస్పిటల్ లో సౌకర్యాలు లేవంటున్నారు బాధితులు. హాస్పిటల్ లో దోమల బెడద ఎక్కువగా ఉందని కనీసం ఫ్యాన్లు కూడా పనిచేయడం లేదని, బెడ్స్ కూడా లేని పరిస్థితి ఉందని ఈ దోమల వల్ల ఒక కుటుంబంలోకి జ్వరం వస్తే ఆ కుటుంబ సభ్యులు ఇక్కడ పడుకుంటే వారికి కూడా జ్వరం సోకుతోందని వెంటనే అధికారులు స్పందించి తగిన సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.మరోవైపు ప్రభుత్వ వైద్యాధికారులను వివిరణ కోరగా సరైన సమాధానాలు చెప్పలేకపోయారు