సిరాన్యూస్, ఆదిలాబాద్
ఆరోగ్యం వైపు నడుద్దాం : కలెక్టర్ రాజార్షిషా
* ఆదిలాబాద్లో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం
ఆరోగ్యం వైపు నడుద్దామని, శారీరక, మానసిక ఆరోగ్యానికి క్రీడలు దోహదం చేస్తాయని జిల్లా కలెక్టర్ రాజార్షిషా అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో గురువారం జాతీయ క్రీడా దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాజార్షిషా, ఎమ్మెల్యే పాయల్ శంకర్ హాజరయ్యారు. ఈసందర్బంగా మేజర్ ధ్యాన్ చంద్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. క్రీడాజ్యోతి వెలిగించి ర్యాలీ చేపట్టారు. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ క్రీడా ప్రాంగణంలో 400 మీటర్ల సింథటిక్ ట్రాక్, హాకీ కోసం ఆస్ట్రో టర్ఫ్, అంతర్జాతీయ ప్రమాణాలతో 50 మీటర్ల స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తామని పేర్కొన్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు ఆటలు ఎంతో దోహదం చేస్తాయని వివరించారు. ప్రభుత్వ ఉద్యోగులకు నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. జాతీయస్థాయిలో మెడల్స్ సాధించిన వారికి క్రీడా దుస్తులు అందించి సన్మానించారు. జిల్లాలో క్రీడల అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో క్రీడల అధికారులు వెంకటేశ్వర్లు, గోవర్ధన్ రెడ్డి, ఆయా క్రీడా సంఘాల బాధ్యులు కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్ర పాల్, కాంతారావు, హరిచరణ్ తదితరులు పాల్గొన్నారు.