సిరా న్యూస్,కడప;
కడప జిల్లా చాపాడు మండలం లక్ష్మీపేట, వీరభద్రపురం గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్తలపై వైసీపీ నాయకులు దాడిచేసారు. బుధవారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో పొలం వద్ద నుండి వస్తుండగా కాపుగాసి కట్టెలు రాళ్లతో సురేంద్రరెడ్డి,చంద్రమోహన్ రెడ్డిలను వెంబడించి కొట్టారు. బాధితులకు వైసీపీ నాయకులకు మధ్య కొద్దీ సంవత్సరాలుగా పొలం వివాదం నడుస్తోంది. టిడిపి ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కు మద్దతుగా ఉన్నామన్న కక్ష తోనే తమపై దాడి చేశారని బాధితులు తెలిపారు. తలకు తీవ్ర గాయాలు, గాయపడ్డ బాధితులును ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చాపాడుపోలీసులు ఈ ఘటనలో ఏడుగురుపై కేసు నమోదు చేసారు.