సిరా న్యూస్,నెల్లూరు;
నెల్లూరు జిల్లా సోమశిల వద్ద కండలేరు వరద కాలువ లీకేజ్‌తో సోమశిల పొదలకూరు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లీకేజి నీటి తో కల్వర్ట్ కుంగి పోవడంతో ప్రయాణికులు విద్యార్థులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. సోమశిల నుంచి కండలేరు ప్రాజెక్టు కు 3 వేల క్యూసెక్కులు నీటి వరద కాలువ ద్వారా వదిలారు. ఈ నేపథ్యంలో కాలువ కు భారీ లీకేజ్ కావడంతో ఈ ఘటన చోటు చేసుకునేది. లీకేజీ నీరు రాజుపాలెం సమీపంలో ని పరమానంద స్వామి ఆశ్రమం వద్ద నుంచి పెన్నానది లో కలుస్తున్నాయి. సోమశిల ప్రాజెక్ట్ అధికారులు మరియు ఆర్ అండ్ బి అధికారులు ఇంతవరకు స్పందించలేదు.ఇరిగేషన్ పంపింగ్ స్కీమ్ పూర్తిగా ధ్వంసమై కూలి పరిస్థితుల్లో ఉంది. నీరు వృధాగా పోతుండడం రహదారి ధ్వంసం కావడం పంపు హౌస్ కూలెందుకు సిద్ధంగా ఉండడం పై అధికారుల నిర్లక్ష్యం గత ప్రభుత్వం వైఫల్యం స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికైనా సోమశిల పై దృష్టి సారించాలని ప్రజలు కోరుకుంటున్నారు.