సిరా న్యూస్,కాకినాడ;
జాతీయ క్రీడా దినోత్సవంను పురస్కరించుకుని గురువారం కాకినాడలో పలు కార్యక్రమాలు నిర్వహించారు . రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ, ఫిజికల్ డైరెక్టర్స్ అసోసియేషన్ ,ఇతర క్రీడా సంఘాల ప్రతినిధుల ఆధ్వర్యంలో కాకినాడలో మూడు కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించారు. వాయిస్: అనంతరం జిల్లా క్రీడా మండలి ప్రాంగణంలో సీనియర్ జాతీయ బాస్కెట్ బాల్ క్రీడాకారులకు సత్కారం చేశారు. వివిధ రంగాల్లో రాణించి దేశానికి, రాష్ట్రానికి పేరు తీసుకొచ్చిన క్రీడాకారులను సత్కరించారు .రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ సీఈవో చుండ్రు గోవిందరాజు, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆఫీసర్ బి శ్రీనివాసకుమార్, ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ జి ఎలీషా, కోశాధికారి కొండలరావు తదితరులు పాల్గొన్నారు.