సిరా న్యూస్,హైదరాబాద్;
హైడ్రా కమీషనర్ ఏవీ రంగనాథ్ గురువారం మీర్ పేటలో పర్యటించారు.
మీర్ పెట్ మున్సిపల్ కార్పోరేషన్ లో కబ్జాకు గురైన మూడు చెరువులను స్థానికులు, అధికారులతో పరిశీలించారు. కబ్జాలకు పాల్పడి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారికి నోటీసులు జారీ చేసిన తరువాత కూల్చివేతలు ఉంటాయి అని అధికారులు తెలిపారు. ఎఫ్ టి ఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలను పరిశీలించారు చెరువుల్లో ఫంక్షన్ హాల్ షాపింగ్ కాంప్లెక్స్ లను పరిశీలించారు. మీర్పేట్ లో మూడు చెరువులు సంధ చెరువు మంత్రాల చెరువు పెద్ద చెరువు ఈ మూడు యొక్క గొలుసుకట్టు చెరువు లను పూర్తిగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. అధికారులను పూర్తిగా చెరువుల యొక్క ఆక్రమాలపై నివేదిక తయారు చేయాలని తెలిపారు. బాలాపూర్ ఎమ్మార్వో, ఆర్ ఐలను పూర్తి వివరాలు అడిగారు. గతంలో కబ్జాలో ఉన్నవారికి ఎవరికైనా నోటీసులు ఇచ్చారు అని ఆరా తీశారు. గతంలో కబ్జా చేసిన వాటిని ఎంతవరకు డీమాలేషన్ చేశారని వాటిపైన పూర్తిగా నివేదిక తయారు చేయాలని బాలాపూర్ ఎమ్మార్వోకు ఆదేశించారు.