BJP Vijay Boyer: సభ్యత్వ నమోదును పెంచాలి : బీజేపీ జిల్లా అసెంబ్లీ కన్వీనర్ విజయ్ బోయర్

సిరాన్యూస్‌, బేల‌
సభ్యత్వ నమోదును పెంచాలి : బీజేపీ జిల్లా అసెంబ్లీ కన్వీనర్ విజయ్ బోయర్

గతంలో కంటే ఈసారి సభ్యత్వ నమోదు మండలంలో పెంచాలని బీజేపీ జిల్లా అసెంబ్లీ కన్వీనర్ విజయ్ బోయర్ అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో సభ్యత్వం నమోదు సమావేశానికి ముఖ్యఅతిథిగా బీజేపీ జిల్లా అసెంబ్లీ కన్వీనర్ విజయ్ బోయర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనమందరం చాలా అదృష్టవంతులమని ,ఓ గొప్ప రాజకీయ పార్టీలో పని చేసే అవకాశం వచ్చిందన్నారు. ఇందుకోసం పార్టీ ఇచ్చిన సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరిని భాగ్యస్వామ్యలు చేయాలన్నారు.రానున్న ఏ ఎన్నికలైనా సరే బీజేపీ పార్టీ గెలుపు లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.రాజకీయ పార్టీ ఉద్యమాలపాటి ఏదైనా సరే వాటికి పునాది సభ్యత్వ నమోదు అని గుర్తు చేశారు. గతం కంటే ఈసారి సంఖ్యను పెంచే విధంగా ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు దత్తా నిక్కం,మాజీ సర్పంచ్ ఇంద్రశేఖర్,బీజేవై మండల అధ్యక్షుడు పొత్ రాజ్ నవీన్, బీజేపీ మండల జనరల్ సెక్రెటరీ సందీప్ ఠాక్రే,ఓ బి సి జిల్లా ఉపాధ్యక్షుడు రాము బర్కడే, గణేష్, శివ కుమార్సురేష్, మోరేశ్వర్, మహేష్, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *