అలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
సిరా న్యూస్,కుత్బుల్లాపూర్;
గాజులరామారం లోని ఎల్ ఎన్ బార్ & రెస్టారెంట్ క్యాషియర్ అకిలేష్ పై ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. గౌతమ్ ,పూర్ణిమ మరియు అజయ్ బార్ వద్ద వారి కారు లో పెట్రోల్ ఐపోవడంతో ఇతరుల కారులోంచి పెట్రోలు దొంగలించడానికి ప్రయత్నిస్తుండగా బార్ క్యాషియర్ అఖిలేష్ గమనించాడు. అకిలేష్ వారిని అడ్డుకోవడంలో గొడవ మొదలయింది. పూర్ణిమ మరోవ్యక్తి నరేష్ కు సమాచారం ఇచ్చింది. నరేష్ మరో నలుగురు తో వచ్చి అకిలేష్ పై కాల్పులు జరిపాడు. బార్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.