డిగ్రీలో ప్రవేశానికి ఈ నెల 31వరకు దరఖాస్తు చేసుకోవాలి
సిరా న్యూస్,పెద్దపల్లి;
దూరవిద్యా కేంద్రాల ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్య అందిస్తున్నట్లు లెర్నర్ సపోర్ట్ సెంటర్ పెద్దపల్లి ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మీనర్సయ్య, కోఆర్డినేటర్ మొహమ్మద్ అబ్దుల్ షుకూర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొనసాగుతున్న ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్లో డిగ్రీ మొదటి సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభమైనవని అన్నారు. ఆగస్టు 31వ తేదీ వరకు ధరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందన్నారు. ఛాయిస్ బేస్ క్రెడిట్ సిస్టం ప్రకారం విద్యార్థులకు విద్య అందిస్తున్నామన్నారు. స్కిల్ సంబంధిత కోర్సులు సైతం అందుబాటులో ఉన్నాయని, విద్యార్థులకు జూమ్ యాప్, యూట్యూబ్ ద్వార తరగతులు నిర్వహిస్తున్నట్లు వివ్రించారు. పోటీ పరీక్షలకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సర్టిఫికెట్లు చెల్లుబాటు అవుతాయని, సదవకాశాన్ని పెద్దపల్లి పరిసర ప్రాంత విద్యార్థులు, నిరుద్యోగులు, గృహిణులు, ప్రయివేటు ఉద్యోగులు, ప్రమోషన్ల అర్హత సాధించుటకు ప్రభుత్వ ఉద్యోగులు వినియోగించుకోవాలని కోరారు. ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థుల ట్యూషన్ ఫీజు చెల్లించుటకు ఈ నెల 31 చివరితేదీగా పేర్కొన్నారు. పూర్తి వివరాలకు కళాశాలలో గానీ, 73829 29654 నంబర్ ను సంప్రదించవలసిందిగా సూచించారు.