సిరాన్యూస్, కాల్వ శ్రీరాంపూర్
పద్మ బ్రాహ్మణ పురోహిత సంఘం జిల్లా అధ్యక్షునిగా భీమని రవీందర్
పద్మ బ్రాహ్మణ పురోహిత సంఘం పెద్దపెల్లి జిల్లా అధ్యక్షునిగా భీమని రవీందర్ ఎన్నికయ్యారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో గురువారం గోదావరిఖని ఆంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన పద్మ బ్రాహ్మణ పురోహిత సంఘం అధ్యక్షునిగా గంగారం గ్రామానికి చెందిన భీమని రవీందర్‌ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ పద్మ బ్రాహ్మణ పురోహిత సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్లగణపతి నుతి అంబదాసు పద్మ బ్రాహ్మణ పురోహిత సంఘం సభ్యులు పాల్గొన్నారు . పద్మ బ్రాహ్మణ పురోహిత సంఘం జిల్లా అధ్యక్షునిగా భీమని రవీందర్ ఎన్నికపై బీజేపీ మండల అధ్యక్షులు చిలువేరు సంపత్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.
