సిరాన్యూస్, కాల్వ శ్రీరాంపూర్
వ్యాసరచన పోటీలో రెండవ స్థానం సాధించిన ముస్కు నాగశ్రీ
శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామిజి మంగళ శాసనములతో ప్రజా వికాస్ వారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో గల ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు పెద్దపల్లి జిల్లాలో ఇటీవల వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఇందులో కాల్వ శ్రీరాంపుర్ మండలంలోని ఇప్పలపల్లి గ్రామ పరిధిలో గల క్రిసెంట్ ఉన్నత పాఠశా లలో 10వ తరగతి చదువుతున్న ఉషన్నపల్లి గ్రామానికి చెందిన ముస్కు అశోక్ సౌజన్య ల కూతురు ముస్కు నాగశ్రీ అను విద్యార్థిని వ్యాసరచన పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 300మంది విద్యార్థులు పాల్గొనగా శ్రీ త్రిదండి చినజీయర్ స్వామిజి విడుదల చేసిన ఫలితాల్లో ము స్కు నాగశ్రీ 2వ స్థానంలో నిలిచింది. ఇoదుకు గాను విద్యార్థికి రూ. 3000 నగదు, ప్రశంసా పత్రమును అందజేయనున్నారు.ఈ సందర్భంగా క్రి సెంట్ పాఠశాలల అధినేత సయ్యద్ వజహతుల్ల ఆయాజ్, సి.ఈఓ తహబిలాల్ .అత్యంత ప్రతిభను కనబరచిన ఈమెను ప్రశంసించారు. భవిష్యత్తులో ఇంకా ఎన్నో విజయాలను సాధించాలని ఆకాంక్షించారు. అలాగే ప్రిన్సిపాల్ నశీర్ ఇంచార్జ్ జాఫర్ ,ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులు తల్లిదండ్రు లు తోటి విద్యార్థులు అభినందించారు. సెప్టెంబర్ రెండవ తేదీన ముచ్చింతలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల అనంతరం అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు ఫలితాలను వెల్లడించి జిల్లా స్థాయిలో ప్రతిభను కనబరిచిన వారికి శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామిజి చేతుల మీదుగా నగదు ప్రశంసా పత్రాన్ని బహుమతులు ఇవ్వడం జరుగుతుందని ప్రజా వికాస్ కోఆర్డినేటర్ తెలిపారు.