సిరాన్యూస్: కాల్వ శ్రీరాంపూర్
ఆర్ ఎంపీ, పీఎంపీల బంద్ విరమించాలి : మాజీ ఎంపీటీసీ పోశాల సదానందం
గ్రామీణ ప్రాంతంలో ఆర్ ఎంపీ, పీఎంపీల బంద్ విరమించాలని మీర్జంపేట మాజీ ఎంపీటీసీ పోశాల సదానందం అన్నారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో ఆర్ఎంపీ పీఎంపీ వైద్యులపై టీఎస్ ఎంసీ , ఐఎంఏ డీఎంహెచ్వో వారిపై దాడి చేసి కేసులు పెట్టడం సరికాదన్నారు. కొన్ని సంవత్సరా లుగా ఆర్ఎంపీపీ ఎంపీ వైద్యులు ప్రథమ చికిత్స చేసుకుంటూ ఉన్నవారిని, లేనివారిని అందరినీ చూస్తూ డబ్బులు ఇచ్చిన, ఇవ్వకుండా వైద్యం చేస్తూ ఉండడమే కాకుండా రాత్రి వెనక పగలనక అవసర నిమిత్తం ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు వచ్చి వైద్యం చేస్తున్న ఆర్ఎంపిపీ ఎంపీ వైద్యులను ఇప్పుడు నకిలీ వైద్యులు అంటూ మీకు పట్టలేదంటూ దాడులు చేయడం కేసులు పెట్టడం సరైన పద్ధతి కాదన్నారు. ఆర్ఎంపీపీ ఎంపీ వైద్యులపై వెంటనే గ్రామాల్లో వైద్యం చేయాలని కోరారు.