సిరా న్యూస్,రాయచోటి;
పట్టణంలో వీధి కుక్కలు స్వైర్యవిహారం చేస్తున్నాయి. జనాలు ఇంట్లో నుంచి బయటికి రావాలంటే భయపడుతున్ఆరు. పిచ్చి కుక్కల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులుపట్టించుకోవడంలేదని స్థానికుల ఆరోపణ.ఉదయం పూట పిల్లలను స్కూలుకు వదలాలంటే భయం. ఒంటరిగా బయటికి రావాలంటే మహిళలు భయపడుతున్నారు. రాయచోటి పట్టణంలో అనేకసార్లు ప్రజల మీద దాడి చేసిన కుక్కలు అయినప్పటికీ చర్యలు శూన్యం. ఈ కుక్కల బెడద నుంచి తమను రక్షించాలని పట్టణ వాసులు కోరుతున్నారు.