సిరాన్యూస్: బేల
సంపూర్ణ ఆరోగ్యానికి క్రీడలు ఎంతో అవసరం : ఉపాధ్యాయుడు కూర పోచన్న
* పాటన్ ప్రాథమికోన్నత పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు
సంపూర్ణ ఆరోగ్యానికి క్రీడలు ఎంతో అవసరమని ఉపాధ్యాయుడు కూర పోచన్నఅన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండంలోని పాటన్ ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఉపాధ్యాయుడు కూర పోచన్న మాట్లాడుతూ ఆటలు ఆరోగ్యానికి ఎంతో అవసరమని విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులతో పాటు తల్లి దండ్రులకు కూడా ఉందని పేర్కొన్నారు. ఆటలో గెలిచిన పిల్లలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మయాకర్, ఉపాధ్యాయలు కూర పొచ్చన్న, లక్ష్మి తదితరులు ఉన్నారు.