సిరా న్యూస్;
28 ఎర్రచందనం దుంగలు, మూడు వాహనాలు స్వాధీనం
వడమాలపేట, పూతలపట్టు పరిసరాల్లో 28 ఎర్రచందనం దుంగలు, మూడు వాహనాలను స్వాధీనం చేసుకుని, 5గురు ఎర్రచందనం స్మగ్లర్ల ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆర్ ఐ సురేష్ కుమార్ రెడ్డికి చెందిన టీమ్ లు కూంబింగ్ చేపట్టారు. ఆర్ ఎస్ ఐ వై విశ్వనాథ్ టీమ్ పుత్తూరు సెక్షన్ లోని వడమాలపేట అటవీప్రాంతంలో జరిగిన కూంబింగ్ లో గురువారం 26 ఎర్రచందనం దుంగలు, ఒక ట్రక్, మరో కారు స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లను చుట్టి ముట్టే ప్రయత్నం లో నలుగురు పట్టుబడగా, మిగిలిన వారు తప్పించు కున్నారు. అరెస్టయిన వారిలో తమిళనాడు తిరువన్నామలై జిల్లాకు చెందిన ముగ్గురు తిరువళ్లూరు జిల్లాకు చెందిన ఒకరు ఉన్నారు. మరో సంఘటన లో ఆర్ ఎస్ ఐ విష్ణు వర్ధన్ కుమార్ చిత్తూరు-కడప హైవేలోని పూతలపట్టు సమీపంలోని రంగంపేట వద్ద రెండు ఎర్రచందనం దుంగలను కారులో తరలిస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు అడ్డుకున్నారు. వారిని చుట్టుముట్టగా ఒక వ్యక్తి పట్టుబడ్డాడు. మిగిలిన వారు పారిపోయారు. కారుతో పాటు రెండు దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తిని అన్నమయ్య జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. పారిపోయిన వారి కోసం గాలిస్తున్నారు. రెండు కేసులను టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ లో నమోదు చేయగా, ఎస్ ఐ రఫీ దర్యాప్తు చేస్తున్నారు.