సిరా న్యూస్,కాకినాడ;
ఎక్కడైతే వేదనాదం వినిపిస్తుందో అక్కడ పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మికత కలిగి పాడిపంటలతో విరాజిల్లుతాయని పెద్దలు చెబుతారు .అలాంటి వేద సభ పెద్దాపురంలో నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన వేదపండితులు సిహెచ్ హరిగోపలశర్మ ఆధ్వర్యంలో పెద్దాపురంలో వేద శాస్త్ర పండిత సన్మాన పరిషత్ ఆధ్వర్యంలో 200 మంది పైగా పండితులు వేదాన్ని వినిపించారు. ఒకేసారి 200 మంది వేదం చదువుతుంటే నిజంగా భగవంతుడు అక్కడే కూర్చున్నాడు అన్నట్లుగా అక్కడి వాతావరణం మారిపోయింది. అనంతరం వేద గురువులు, హరి శంకరాచార్య వేద ట్రస్ట్ అధ్యక్షుడు గోపాలకృష్ణశర్మను ఘనంగా సత్కరించారు. లోకం సుభిక్షంగా ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని ఈ వేదసభ నిర్వహించారు. అనంతరం పండిత సత్కారం చేశారు.