సిరాన్యూస్: ఓదెల
ఎల్ఓసీ అందజేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన మల్లయ్య అనారోగ్యం కారణంగా హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్లో చేరారు.ఈ సందర్బంగా మల్లయ్య కి ఆరోగ్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయక నిది ద్వారా రూ. 2,25,000/- (రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల) ఎల్ ఓ సి చెక్కును మంజూరైంది. శుక్రవారం హైదరాబాద్ లోని డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.