సిరాన్యూస్, బోథ్
ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత : రామాలయ కమిటీ చైర్మన్ జి.వి రమణ
* ఆలయానికి రూ.10వేలు అందజేసిన మాజీ సర్పంచ్ చెట్లపల్లి సదానందం
ఆధ్యాత్మికతోనే మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని రామాలయ కమిటీ చైర్మన్ జి.వి రమణ అన్నారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని సోనాల రామాలయంలో నిత్య భజనలు చేస్తున్న సీతారామ భజన మండలి కళాకారులకు, రామాలయ కమిటీ చైర్మన్ జి.వి రమణ ఆధ్వర్యంలో ఘనమైన సన్మాన సత్కారాలు జరిగాయి.ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పలువురు వక్తలు ప్రసంగించారు. సీతారామ భజన మండలి వారి సంకీర్తనలు అమూల్యమైనవని, నెల రోజులపాటు అత్యంత నియమనిష్టలతో భగవాన్ నామ స్మరణ చేస్తూ ,నిత్య భజనలు కొనసాగించడం అపూర్వమని, భజన కళాకారుల సేవలు నిరుపమానమని, గ్రామమంతట ఆధ్యాత్మిక వాతావరణం, భక్తి భావాలను వెదజల్లారని పేర్కొన్నారు.భజన అనేకళ అంతరించిపోకుండా భవిష్యత్తు తారాల వారికి అందించాలని కోరారు.ఈ సందర్భంగా భజన కళాకారులకు అవసరమైన సామాగ్రిని కొనుగోలు చేయడానికి సోనాల గ్రామ మాజీ సర్పంచ్ చెట్లపల్లి సదానందం పదివేల రూపాయల విరాళాలన్నీ ప్రకటించారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువకులు , భక్తులు పాల్గొన్నారు.